సీఎం కేసీఆర్ బర్త్ డే…సాంగ్‌ రిలీజ్ చేసిన ఎంపీ సంతోష్‌

206
mp santhu
- Advertisement -

సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ ను విడుదల చేశారు ఎంపీ సంతోష్ కుమార్.టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరుగగా ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు 50 దేశాల ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంతోష్‌…50 దేశాల నుంచి జై తెలంగాణ వింటుంటే సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు….తెలంగాణ ఏర్పడినప్పుడు 24 శాతం గ్రీన్ కవర్.. 6 శాతం పెరిగిందన్నారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ 210 కోట్ల మొక్కలు నాటించారు….ఇవన్నీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తూన్న లెక్కలు అన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పదుల కోట్ల సంఖ్యలో మొక్కలు నాటాం అన్నారు. ముఖ్యంగా మొక్కలు పెంచడంపై అవగాహన కల్పిస్తున్నాం….కోటి వృక్షార్చన గురించి మంత్రి కేటీఆర్ దగ్గర ప్రస్తావించగానే.. వెంటనే సపోర్ట్ చేశారని చెప్పారు.

కోటి వృక్షార్చన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది…..సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం అన్నారు. 17వ తేదీ ఆయా దేశాల సమయాన్ని బట్టి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య మొక్కలు నాటండి…మీ సన్నిహితులతో రేపు మొక్కలు నాటించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కను సెల్ఫీ తీసుకుని 90003 65000 నెంబర్ కు పంపండి..రాబోయేదంతా గ్రీనిజమే అన్నారు. ఎన్నారైల సమస్యలపై ప్రత్యేకంగా మరో రోజు 4-5 గంటలు సమావేశం నిర్వహించుకుందాం అన్నారు.

- Advertisement -