మానవ మనుగడలో డాక్టర్ల పాత్ర మరువలేనిది: ఎంపీ సంతోష్

27
- Advertisement -

“నేషనల్ డాక్టర్స్ డే” సందర్భంగా డాక్టర్లందరికి రాజ్యసభసభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ మనుగడలో డాక్టర్ల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు.

ఏ స్వార్ధం లేకుండా సకల జీవకోటికి ప్రాణవాయువు అందించే మొక్కల్లాగే.. డాక్టర్లు కూడా నిస్వార్ధంగా సేవ చేస్తుంటారని ఆయన డాక్టర్లను కీర్తించారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అతికొద్ది మందిలో డాక్టర్లు కూడా ఒకరని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “నేషనల్ డాక్టర్స్ డే” సందర్భంగా ప్రతీ డాక్టర్ మొక్కను నాటి సమాజానికి గ్రీన్ మెసేజ్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -