పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ‘రోజా’ ను ఆచరిస్తారు.ఉపవాసానికి ముందు తెల్లవారుజామున సెహ్రీ ముందస్తు భోజనం తీసుకుంటారు.ఉపవాసం విడిచే ముందు ఇఫ్తార్ విందు ఆనవాయితి.
ఈరోజు GHMC మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో ముస్లిం సోదరులు తెల్లవారు జామున 5 గంటల లోపు తీసుకునే సెహ్రీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు స్వయంగా భోజనాలు వడ్డించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు సెహ్రీ ఇవ్వడం అనందంగా ఉందని అన్నారు.గత ఆరు సంవత్సరాలుగా బాబా ఫసీయుద్దిన్ అధ్వర్యంలో ప్రతిరోజు దాదాపు 400 మంది ముస్లీం సోదరులకు తెల్లవారుజామున భోజనాలు అందించడం చాలా గొప్పవిషయం అని కొనియాడారు. హిందూ సోదరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వారికి భోజనాలు వడ్డించడం చాలా గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అన్నారు.ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన బాబాఫసీయుద్దిన్‌ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.
అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ ,కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ బోరబండ డివిజన్ లో రంజాన్ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెహ్రీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ రోజు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు సెహ్రీ భోజనాలు వడ్డించడం సంతోషంగా ఉందని అన్నారు.గంగా జమున తహెజీబ్ కనిపిస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కనిపిస్తోందని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు భోజనాలు వడ్డించేందుకు హిందు, క్రైస్తవ సోదరులు వచ్చి పాల్గొంటారని అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ తన చేతుల మీదుగా ఉపవాసం ఉన్న సోదరులకు భోజనం వడ్డించడంతో ముస్లిం సోదరులు ఎంపీ సంతోష్ కుమార్ కి దువా ఇవ్వడం జరిగిందని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్, వారి కుటుంబ సభ్యులు ఆయుఆరోగ్యాలతో ఉండాలని దువా ఇవ్వడం జరిగిందని బాబా ఫసియుద్దీన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, స్థానిక టీఆరెస్ నాయకులు ,ముస్లిం మత పెద్దలు హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు.