త్వరలో ఎంపీ సంతోష్ కుమార్ నర్సరీ ప్రారంభం..

419
mp santhosh kumar
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా మొక్కలు నాటారు.

తాజాగా సంతోష్ కుమార్ పేరుతో త్వరలో నర్సరీ ప్రారంభం కానుంది. ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నర్సరీ ప్రారంభించనున్నట్లు తాడిచెర్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాలకు చాలా ఉపయోగకరమైందన్నారు.

- Advertisement -