MP Santhoshkumar:రాష్ట్రమంతా థీమ్ పార్కులు

42
- Advertisement -

కల్వకుంట్ల శోభ(పెద్దమ్మ) జన్మదినం సందర్భంగా బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ రూ.15 లక్షల విరాళం అందించి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన 10K, 5K మరియు 3K రన్ ఫర్ పీస్‌ను ప్రారంభించారు.గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఎంపీ అభినందించారు.

ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది ఫిట్ నెస్ , ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఇలాంటి సందర్భంలో రన్ ఫర్ పీస్ వంటి కార్యక్రమం ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుందన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గార్డెన్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గాంధీ రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

అన్యాక్రాంతం అయ్యే ఈ బొటానికల్ గార్డెన్… కేసీఆర్ వల్లే ఇంత బాగుందన్నారు. ఇక్కడున్న ప్రతి చెట్టుని కాపాడుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని… రాష్ట్రం మొత్తం థీమ్ పార్క్స్ ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వీ ప్రతాప్‌రెడ్డి, బొటానికల్‌ గార్డెన్‌ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ, సింగరేణి డైరెక్టర్‌ బలరాం, అటవీశాఖ అధికారులు, వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Also Read:జగన్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్!

- Advertisement -