బోడుప్పల్‌లో మాంగళ్య … ప్రారంభించిన సంతోష్ కుమార్‌

282
mp santhosh
- Advertisement -

కస్టమర్ల అభిరుచికి తగిన రీతిలో నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో ఉంచే మాంగళ్య షాపింగ్‌ మాల్ హైదరాబాద్ బోడుప్పల్‌లో ప్రారంభమైంది. సోమవారం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాంగళ్యషాపింగ్‌ మాల్ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,టీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు,స్ధానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

santhosh trs

గతంలో ప్రముఖ కార్ల కంపెనీ టొయోట భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొత్త మోడల్‌ ఫార్చునర్‌ని హైదరాబాద్‌లో లాంఛ్ చేయగా సంతోష్ కుమార్ ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి ప్రారంభించిన సంతోష్ గతంలో విడుదల చేసిన మోడల్‌ కంటే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు.

ఇటీవలె మియాపూర్‌ మదీనగూడలో నూతనంగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్‌మాల్‌ను టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ,సినీ నటి కాజల్‌అగర్వాల్‌తో కలిసి ప్రారంభించారు.

MP santhosh

- Advertisement -