22వ రోజుకు చేరిన సంతన్న అన్నదాన కార్యక్రమం..

542
free food distribution
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ వలస జీవులకు,పేదకుటుంబికులు ఆకలితో ఒక్కరోజు కూడా నిద్ర పోవద్దు అని పిలుపునివ్వడంతో బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమం 22వ రోజుకు చేరింది. బోయినిపల్లి జడ్పీటిసి మరియు కోదురుపాక టీఆర్‌ఎస్‌ యువనాయకులు భోజనాలు వడ్డించారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక దూరం పాటిచాలి అని ప్రతి రోజు అన్నదాన కేంద్రం వద్ద కరోనాని అరికట్టడానికి అవగాహనా కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవీందర్ రావు గ్రామస్తులకు తెలిపారు.

free food

మా ఊరి ముద్దుబిడ్డ ఇంతలా కార్మికుల కోసం ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి కమల్, నాగుల నాగరాజు, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు,నల్ల సతీష్, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

- Advertisement -