సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందన్నారు…గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. కూకట్ పల్లి.. కే.పీ.హెచ్.బీ ఫేజ్ – 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు *జోగినిపల్లి సంతోష్ కుమార్* “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన ఇష్టమని.. అలాంటి పండుగలో ఒక మంచి ఆశయాన్ని జతచేయాలనే ఆలోచనతో నాలుగు సంవత్సరాల క్రితం విత్తనాలను మిళితం చేసి గణేష్ ప్రతిమలను తయారు చేయించి భక్తులకు అందించాం. దానికి మంచి స్పందన రావడం.. చిన్నారులు, వారి తల్లిదండ్రులు సీడ్ గణేషుడి ప్రతిమలు కావాలని అడగడంతో ప్రతీసారి ప్రతిమలను పంపిణీ చేస్తూ వస్తున్నాం.ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ చిన్నారి ఎంతో సంతోషంతో గణేష్ ప్రతిమలను తీసుకోని మురిసిపోవడం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. కల్ముషం లేని వారి మనసులో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా ఒక సామాజిక బాధ్యతను నేర్పుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్.
కార్యక్రమంలో పాల్గొన్న పుష్ప సినిమా చైల్డ్ ఆర్టిస్టు ద్రువన్ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాకు వినయకచవితి పండగ అంటే చాలా ఇష్టం. ఈలాంటి పండగలో సీడ్ గణేషుడి ద్వారా భక్తి, ప్రకృతికి మేలు చేసేలా విత్తనాలను కలిపి అందించడం నాకు చాలా ఇన్సిపిరేషన్ కలిగించిందని..ప్రతీ ఒక్కరు సీడ్ గణేష్ ను ప్రతిష్టించాలి.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Year after year, under #GreenIndiaChallenge, we have been devoting ourselves to replace the ordinary Plaster of Paris idols with eco-sensitive alternatives. The stupendous #SeedGanesha idols, crafted with reverence, are not merely biodegradable, but they also flourish into a… pic.twitter.com/NEqKrYjO87
— Santosh Kumar J (@SantoshKumarBRS) September 3, 2023