టీఆర్‌ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు బంజారాహిల్స్ బంజారా ఫంక్షన్ హాల్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్,ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ , నవీన్ రావు , టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రక్తదానం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు కర్నే ప్రభాకర్, నవీన్ రావు,టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
As our @trspartyonline working president Sri @KTRTRS garu has given a call to donate blood on the occasion of 20th #FoundationDay of our party, I did my part by donating blood at Pragathi Bhavan. Very quiet celebrations amid #COVID19 Pandemic.#20YearsOfTRS Celebrations 🎉 . pic.twitter.com/tvng7Xu57Q
— Santosh Kumar J (@MPsantoshtrs) April 27, 2020