- Advertisement -
టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ బంజారా ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సంతోష్ కుమార్ హాజరై రక్తదానం చేశారు. సంతోష్‌తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే బాల్క సుమన్ , మేయర్ బొంతు రామ్మోహన్ , ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ , నవీన్ రావు , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -