గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన న్యూజిలాండ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు

232
Green

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్ nri కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా , టీఆర్ఎస్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన , UK తెరాసవ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం , తెరాస న్యూ జీలాండ్ గౌరవ ఛైర్పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి ఛాలెంజ్ చెయ్యడం జరిగింది.

green2

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి న్యూ జీలాండ్ లో మొక్కలు నాటుతున్నామని , జోగినపల్లి సంతోష్ కుమార్ ఇటీవలి వరకు 3 కోట్ల మొక్కలు నాటడానికి స్ఫూర్తినివ్వడం గొప్ప ఉద్దేశ్యం అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ మొక్కలు నాటే విషయం లో స్వార్థ పూరితంగా వుండి తమ ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళ కంటే ఎక్కువ మొక్కలు వుండాలనుకోవాలన్నారు.

అలాగే తమ కుటుంబ సభ్యులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించి తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు, త్వరలోనే ఎంపీ సంతోష్ కుమార్ 10 కోట్ల మొక్కల లక్ష్యాన్ని చేరి హర భర తెలంగాణ ను చూడాలని ఉందని తెలిపారు. తెలంగాణ కు గ్రీన్ ఛాలెంజ్ ఆవశ్యకత ఉందని అందుకే తన నియోజకవర్గ MLA శ్రీ సుంకే రవిశంకర్ , తన గ్రామ సర్పంచ్ అప్పిడి సౌజన్య రెడ్డి ని , కరీంనగర్ మండల తెరాస అధ్యక్షుడు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి ని , తన తండ్రి లక్ష్మారెడ్డి ని ఛాలెంజ్ ను స్వీకరించి ఇతరులను ఈ దిశగా ప్రోత్సహించాలని తెలిపారు .

ఈ ఛాలెంజ్ లో , విజయభాస్కర్ రెడ్డి కొసన , కళ్యణ్ రావు కాసుగంటి , తెరాస న్యూ జీలాండ్ , జనరల్ సెక్రటరీ నర్సింగరావు ఇనగంటి , ఉమెన్స్ అఫైర్స్ చైర్ పర్సన్ శ్రీమతి సునీత విజయ్ , మెంబర్షిప్ ఇంచార్జి కిరణ్కుమార్ పోకల మొక్కలు నాటారని తెలిపారు .