బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి అన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. వరంగల్ జిల్లాలో మాట్లాడిన రవిచంద్ర..సుమారు పది లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది, ఎండాకాలం దృష్ట్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
కేసీఆర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఒక భరోసానిచ్చే విధంగా ఉంటుంది.. కాంగ్రెస్ బిజెపి నేతలు ఎన్ని విమర్శలు చేసిన రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు అన్నారు. మా గులాబీ పార్టీ పుట్టి 25 ఏళ్లు.. అందుకే ఈ సంబరాలు జరుపుకుంటున్నాం అన్నారు.
అలవి గాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది.. హామీలు అమలు అయ్యేవరకు రాష్ట్ర ప్రజల తరఫున గట్టిగా పోరాడుతాం అన్నారే. కేసీఆర్ ప్రసంగం వినేందుకు భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది.. తెలంగాణ తెచ్చిన పేరు కేసీఆర్‌కు చాలు.. వందల సంవత్సరాలు ఆ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు.
Also Read:సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంది కేసీఆర్:కవిత

