తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపిస్తుందని…ప్రధాని మోడీ ఫ్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. బీజేపీ నేతలు కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు చేస్తున్నారని…దీనిపై పార్లమెంట్‌లో నిలదీస్తాం అన్నారు.
బీజేపీ ఎంపీలు ముందు రాష్ట్రానికి తేవాల్సిన నిధుల గురించి ఆలోచించండి, రాజకీయాలు కాదన్నారు. ఎంపీ అయ్యి ఒక సంత్సరకాలం పూర్తి అయ్యిన సందర్భంగా ప్రగతి నివేదనతో ప్రజల ముందుకు వచ్చారు రంజిత్ రెడ్డి.
ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశం, అది నాకు దక్కడం అదృష్టం అని…ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఫెడరల్ టైప్ గవర్నమెంట్ కావాలి అని గుజరాత్ సీఎం… ఇప్పుడు ప్రధాన మంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పారు.
వైద్య విద్య ఉపాధి లేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తున్నారని…మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం లాక్ డౌన్ వాయిదా వేశారు. అదే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదన్నారు.
కొవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు.హెలికాప్టర్ మనీ అని కెసిఆర్ గారు చెప్తే చెయ్యలేదు. ఇన్నిసార్లు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీ…తర్వాత ఆ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదన్నారు.
FRBM లోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదన్నారు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ను నిలదీస్తాం అన్నారు.