ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి మొక్కలు నాటిన ఎంపీ రంజిత్ రెడ్డి..

93
- Advertisement -

రాజేంద్ర నగర్ నియోజకవర్గం,బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గంధంగూడలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి. అనంతరం వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకపోవడం జరుగుతుందని అన్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

- Advertisement -