హైదరాబాద్ ఫార్మా జోన్‌గా ఉందని తెలిపారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. పార్లమెంట్‌లో ఫార్మాసిటీపై మాట్లాడిన రంజిత్ రెడ్డి…హైదరాబాద్‌లో 600 పార్మా కంపెనీలు,200 బయోటెక్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. 22 వేల కోట్ల రూపాయల ఎక్స్ పోర్ట్స్ చేస్తున్నాయని…
భారతదేశంలో మూడవ వంతు ఎక్స్‌పోర్ట్స్ హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయన్నారు.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మాసిటీని చేవెళ్ల నియోజకవర్గం లో ఏర్పాటు చేయడానికి ప్రకటించారన్నారు.
19 వేల మూడు వందల ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ , ఆర్ అండ్ డి రెండు విభాగాల్లో జీరో డిశ్చార్జ్ విధానంలో ఏర్పాటు కాబోతుందని…60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు.
50 వేల కోట్ల రూపాయల ఎక్సపోర్ట్స్ జరగనున్నాయన్నారు.
ఫార్మాసిటీతో 4.2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పిన రంజిత్ రెడ్డి…
కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకి ప్రాధమికంగా ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది, కాబట్టి కేంద్ర కామర్స్ మంత్రి మరియు ఇండస్ట్రీ మంత్రి పరిశీలించి ఈ ఫార్మసీ టి కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానిఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) గా దీనిని ప్రకటించాలని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రంజిత్ రెడ్డి.