అభివృద్ధికి అండగా నిలిచారు: పురందేశ్వరి

2
- Advertisement -

మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి మహారాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని…288 అసెంబ్లీ స్థానాలకు 220 సీట్లకు పైగానే గెలుచుకుంటున్నాం అన్నారు. విభజించు, పాలించు నినాదంతో దేశంలో ఇండియా కూటమి పని చేస్తుందని మండిపడ్డారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆనందాన్ని ఇచ్చాయన్నారు జీవీఎల్ నరసింహారావు. ప్రధాని మోదీ కూటమికి ప్రజలు పెద్దఎత్తున ఓట్లు వేశారని…హర్యానా ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ప్రజలు ఓట్లు వేశారు అన్నారు. ఏపీలో ప్రజలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి పెద్దఎత్తున ఓట్లు వేశారు..రానున్న రోజుల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు. మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

ALso Read:కాంగ్రెస్ అబద్దాలను కడిగేసిన కాగ్

- Advertisement -