- Advertisement -
వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ జయవాని దంపతులు శనివారం న్యూ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన 26వ వివహా దినోత్సవ కార్యక్రమం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్లోబల్ వార్మిగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను అన్నారు.
- Advertisement -