ఎన్ కౌంటర్‌పై ఎంపీ నవనీత్ కౌర్ స్పందన..

358
MP Navneet Kaur
- Advertisement -

దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీలో పలువురు ఎంపీలు తమ స్పందనను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ,సినీ నటి నవనీత్ కౌర్ స్పందిస్తూ.. ఒక తల్లిగా, బిడ్డగా, భార్యగా తెలంగాణ పోలీసులు చేసిన పనిని నేను స్వాగతిస్తున్నాను.. లేకపోతే సంవత్సరాలుగా వారు జైలులోనే ఉంటారు.. ఇలాంటి ఘటనలలో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలి అని అన్నారు.

దిశ హత్యాచార నిందితులు ఎన్ కౌంటర్‌లో చనిపోవడానికి వారు సరైన అర్హులే.. వాళ్ళను ఎం కౌంటర్ చేయడాన్ని దేవుడు కూడా ఒప్పుకుంటాడు. ఇది మంచి పాఠం. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి వారు చనిపోయారు. ఏ ఎన్జీఓ కూడా ఈ ఎన్ కౌంటర్ ని వ్యతిరేకించకూడదు.. అలా చేస్తే, వారు దేశ వ్యతిరేకులు అవుతారు. అని వైస్సార్సీపీ ఎంపీ కనుమురు రఘురామ కృష్ణమరాజు అన్నారు.

- Advertisement -