కేకే సవాల్‌ను స్వీకరించిన ఎంఏ ఖాన్..

670
MP m a khan
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశ రాజధాని ఢిల్లీలో విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్‌ను వివిధ పార్టీల ఎంపీలు స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. ఇటీవల ఎంపీ కేకే విసిరిన గ్రీన్ సవాల్‌ను రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ స్వీకరించిన ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేకే, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు.

kk

అనంతరం రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ మాట్లాడుతూ.. కలుష్యరహిత దేశంగా మార్చాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని..రానున్న రోజుల్లో ప్రతి ఎంపీ ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాని ఎంఏ ఖాన్‌ తెలిపారు.

mp kk

MP M A Khan Accepted Green Challenge By MP Santosh Kumar,He Planted Three Saplings..

- Advertisement -