తెలంగాఆణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.సిఎం కేసీఆర్ మినహా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలందరు వారి నియోజక వర్గాల్లోనే కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని చెప్పారు.
హరీష్ రావు సైతం సిద్దిపేట్ లో జరుగుతున్న కాళేశ్వరం సంబంరాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.సిద్దిపేట లో సైతం ముఖ్యమైన కొండ పోచమ్మ, మల్లన్న సాగర్, రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి..కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు రాష్ట్రంలోని గ్రామ, గ్రామానికి, మూల మూలకు అందనున్నాయన్నారు.అందుకే ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయిని అని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాల కారణంగా ఎంపీలం కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేకపోతున్నామని అందుకే ఢిల్లీ తెలంగాణ భవన్ లో వేంకటేశ్వర స్వామి, కనక దుర్గ అమ్మవారికి పూజలు నిర్వహించి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించామన్నారు.