ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

54
- Advertisement -

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఎంపీ కడుపులో కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ని గజ్వేల్ ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.

ఇక దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దాడి జరిగిన వెంటనే ఆయన్ని ఫోన్‌లో పరామర్శించారు మంత్రి హరీశ్ రావు.హుటాహుటిన గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:బీజేపీలో భయం మొదలైందా?

- Advertisement -