- Advertisement -
కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగానే ఇది గుడ్ న్యూస్. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుండగా వాటికి చెక్ పెడుతూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపగా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రేవంత్. హ్యాపీ టైమ్స్ అంటూ కోమటిరెడ్డితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఇటీవలె రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన రెండు రోజుల దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత ఎవరిదారి వారిదే అన్నట్టుగా మారింది. అయితే తాజాగా వీరిద్దరు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -