ఉన్నత చదువులకు అండగా ఉంటా: ఎంపీ కోమటిరెడ్డి

59
komatireddy
- Advertisement -

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన పున్న అశోక్ అనే వ్యక్తి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. అయితే అతని తల్లిదండ్రులకు శిక్షణకు అయ్యే ఖర్చు భరించడానికి స్తోమత లేకపోవడంతో అతని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. న్యూస్ పేపర్లో రావడం ద్వారా చదివి విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అశోక్ సాయిని హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకుని సన్మానించారు.

పైలట్ శిక్షణ కంప్లీట్ అయ్యే వరకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరంకు 51000/- వెయ్యిల రూపాయలు ఖర్చు అవుతుంది వాటితో పాటు అన్నిరకాలుగా అండగా ఉంటా అని ఎంపీ కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. దీంతో అశోక్ తీవ్ర భావోద్వేగం చెందారు. కష్టపడి చదివి ఫైటర్ పైలట్ శిక్షణకు ఎంపికైనా డబ్బులు లేకపోవడంతో.. ట్రైనింగ్ కు వెళ్లలేనేమోనని భయం‌ వేసిందని , ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి పిలిపించుకుని ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

ఎంపీ కోమటిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని , ఆయన ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి ట్రైనింగ్ పూర్తి చేస్తానని చెప్పారు.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకోవడానికి అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -