కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుష్ప్రచారాలను మానుకోండి అన్నారు ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి. కిషన్ రెడ్డి మీరు ఒక బాధ్యతగల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి ఎంపీ బండి సంజయ్ గారిలా మాట్లాడుతూ తానల ప్రవర్తిస్తూ తన స్టైల్ లో మాట్లాడుతూ వారి బాటలో నడుస్తున్నట్టు కనబడుతుందన్నారు.
నిన్న భారతదేశం కప్పు గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటురు, ట్యాంక్ బండ్ పై కూడా చాలామంది యువత చేరి అక్కడ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా విషయాన్ని మనం గమనించాం అన్నారు.
దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి చర్యను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడానికి ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు,మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలను చేయడాన్ని తప్పు పడుతున్నాం అన్నారు.
మీరంటే మా పార్లమెంట్ సభ్యులందరికీ మాకు చాలా గౌరవం మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి, పనికిరాని విషయాలను , వాస్తవాలు లేని మాటలు మాట్లాడటాని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు చామల.
Also Read:కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ

