కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై భువనగిరి ఎంపీ,చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ కేబినెట్ లో మంత్రినా, కేసీఆర్ పామ్ హౌస్ లో పెద్ద పాలేరా? చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి ,కేసీఆర్ కు పెవర్ గా ఉంటే మాకు అభ్యతరం లేదు… కిషన్ రెడ్డి గులాబీ కండ్ల జోడు తీస్తే అన్ని కనిపిస్తాయి అన్నారు.కిషన్ రెడ్డి ,ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు ఒక్కటేనన్నారు.
కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ భూములు లాక్కోవడానికి దాదాగురి చేస్తున్నారు.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తెస్తే ఊరుకునేది లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో లక్ష 78వేల 950 కోట్లు పెట్టుబడులు తెచ్చారు.. బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతుందన్నారు. అందుకే వాళ్లకు టాబ్లెట్స్,సిరప్ లు పంపాము, బీజేపీ ఆపిసులో తయారైన స్క్రిప్ట్,బీఆర్ఎస్ ఆఫీస్‌కు, బీఆర్ఎస్ ఆఫీస్‌లో తయారైన స్క్రిప్టు బీజేపీ ఆఫీస్‌కు పోతుందన్నారు.
కిషన్ రెడ్డి జిరాక్స్ కాపీలు తెప్పించుకొని మాట్లాడుతున్నాడు.. తెలంగాణ ఏ దేశంలో ఉంది కిషన్ రెడ్డి గారు భారత దేశంలో లేదా? అన్నారు. తెలంగాణలో ఉన్న కంపెనీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు పోవద్దా?, మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ లో రిలయన్స్ కంపెనీ తో ఎందుకు మాడు లక్షల కోట్ల mou ఎందుకు చేసుకున్నాడు చెప్పాలన్నారు.
Also Read:లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్