- Advertisement -
ప్రపంచంలో అతిగొప్ప ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందన్నారు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ లున్న అమెరికా, ఈజిప్ట్ సరసన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో భారత్ నిలిచిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ప్రాజెక్ట్ గా మేం భావిస్తున్నామని రీడిజైన్ తో కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణకు, దేశానికి పండగ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరుతాయని చెప్పిన కేకే..ఇది కెసిఆర్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ..క్రెడిట్ అంతా కెసిఆర్ దే అన్నారు.నేడు తెలంగాణకు పండగ రోజు ..కాళేశ్వరం ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.ముందుచూపుగా నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు కెసిఆర్ మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పారు.
- Advertisement -