కార్మికుడి ఆనందం చూడాలన్నదే కేసీఆర్‌ ఆకాంక్ష

204
Online News Portal
MP Kavitha visits Badradi kothagudem
- Advertisement -

సింగరేణి అభివృద్ధి కోసం.. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత తొలిసారి జిల్లాలోని కొత్తగూడెం పర్యటనకు ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆమెను ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత, మంత్రి తుమ్మల వీకే 7 షాప్ట్ బొగ్గుగనిలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కేసీఆర్‌ ఎటువంటి వివక్ష లేకుండా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ఆయన ఆకాంక్షని తెలిపారు. సింగరేణి ఉద్యమానికి ప్రజలంతా మద్దతునివ్వాలని కోరారు. సింగరేణి కార్మికుడు సరిహద్దులో ఉన్న సైనికుడితో సమానమన్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నరు. 57 వేలకు పైగా సింగరేణి ఉద్యోగులు ఉన్నారు. సింగరేణి కార్మికుల కష్టం సీఎం కేసీఆర్‌కు తెలుసు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ సీఎం కేసీఆర్ పరిష్కరిస్తరు. నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తమని తెలిపారు. ప్రతి సింగరేణి కార్మికుడి కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం ఆకాంక్ష అన్న ఎంపీ సింగరేణి అభివృద్ధి కోసం సీఎంకు అందరూ అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకట్‌రావు, కోరం కనకయ్య, స్థానిక బొగ్గు కార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -