వార్‌ వన్‌సైడే..16 ఎంపీ స్ధానాలు మావే:ఎంపీ కవిత

206
mp kavitha
- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అని స్పష్టం చేశారు ఎంపీ కవిత. ఇవాళ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికోసం కృషిచేయాలన్నారు. గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆ దిశగా సర్పంచ్‌లు అడుగువేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 80 శాతం విజయం సాధించారని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16,ఎంఐఎం ఒక ఎంపీ స్థానాన్ని గెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు రెఫరెండంగా ప్రజలకు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని చెప్పారు. సెక్రటేరియట్ కోసం డిఫెన్స్ ల్యాండ్స్ విషయంలో కేంద్రం సహకరించడం లేదని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలమంతా పోరాటం చేస్తాం.. ప్రధానిని కలిసి నిలదీస్తామని తెలిపారు.

మరోవైపు గరీబీ హఠావో లాంటి కాంగ్రెస్ నినాదాలు స్లోగన్స్ వరకే మిగిలిపోతున్నాయని ఆరోపించిన కవిత… ప్రియాంకగాంధీ వచ్చినా.. మరో ఇందిరాగాంధీలా అయినా దేశానికి ఓరిగిదేమీలేదన్నారు. కాంగ్రెస్,బీజేపీ దొందు దొందేనని విమర్శించిన కవిత కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను అధికారంలోకి తీసుకురావాలన్నారు. గల్ఫ్‌ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

- Advertisement -