మహాకూటమి దుష్టచతుష్టయం: ఎంపీ కవిత

232
- Advertisement -

మహాకూటమి దుష్టచతుష్టయమని మండిపడింది ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టింది. ఓటింగ్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలని ఆమె సూచించింది.

ఆరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపించారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీలు మహాకూటమిగా వస్తున్నాయని ప్రజలు అంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కారు జోరును ఎవరు ఆపలేరని స్పష్టం చేసింది.

మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఊరూవాడా కలియదిరుగుతు గులాబీ పార్టీకి మద్దతుఇవ్వాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు గ్రామాల్లో మంత్రి మహేందర్ రెడ్డి జెండా పండుగ నిర్వహించారు.

kavitha

నిజామాబాద్ నగరంలోని 42వ డివిజన్‌లో అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా పాదయాత్ర చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఆదరించాలని కోరారు.

కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎంపీ బీ వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.

Mahendhar

- Advertisement -