కవిత సెల్ఫీ విత్ మెగాస్టార్

246
MP Kavitha selfie with Megastar
- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో పాటు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ ఉదయం ఓటువేశారు. ఇక‌.. మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ క‌విత కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. త‌ర్వాత‌… ఎంపీ కవిత‌.. మెగాస్టార్ చిరంజీవి తో సెల్ఫీ దిగారు. సెల్ఫీ విత్ మెగాస్టార్ ఫోటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతా లో పోస్ట్ చేశారు క‌విత‌. అంతే కాదు.. మెగాస్టార్ కు తను పెద్ద అభిమానినంటూ క్యాప్ష‌న్ పెట్టారు క‌విత‌.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగుస్తున్నందువల్ల కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోడానికి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌లోని 62వ రూమ్‌లో పోలింగ్ జరగనుంది.  సాయంత్రం ఏడు గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

అధికార ఎన్డీయే మద్దతుతో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల మద్దతుతో మహాత్మాగాంధీ మనుమడు గోపాల్‌గాంధీ ఈ పదవికోసం పోటీపడుతున్నారు. ఉభయసభల్లోని బలాబలాలను కలుపుకుంటే మొత్తం 788 మంది ఎంపీల్లో మెజారిటీ సభ్యుల బలం ఎన్డీఏ అభ్యర్థికే ఉన్నందువల్ల వెంకయ్యనాయుడి గెలుపు దాదాపుగా ఖరారైనట్లే.

- Advertisement -