మహిళలకు మంత్రిపదవి..స్పందించిన ఎంపీ కవిత

229
mp kavitha
- Advertisement -

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ దక్కకపోవడంపై ఎంపీ కవిత స్పందించారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాల్లో భాగంగా నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో పాల్గొన్న ఆమె పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కేలా చేయడంలో నాన్న కేసీఆర్‌ని ప్రభావితం చేయలేనని తెలిపారు. పార్టీలో తాను చాలా జూనియర్‌ని అని కేసీఆర్ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని ఒకవేళ తాను ప్రయత్నించినా అది సాధ్యపడదని చెప్పారు.

మహిళలకు సమాన స్థాయి కల్పించడంలో అన్ని పార్టీల తీరు ఒక్కటే… ఇందుకు టీఆర్‌ఎస్‌ మినహాయింపు కాదని కవిత నిర్మొహమాటంగా చెప్పారు. మహిళలకు తప్పనిసరిగా సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం కానీ, పార్లమెంట్‌ కానీ నిర్ణయిస్తేనే మార్పు వస్తుందన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్‌ అనేది ఎన్నికల స్టంట్‌ కోసమే తప్ప అందులో విధాన పరమైన పారదర్శకత లేదన్నారు. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు సమీప భవిష్యత్తులో ఆమోదం పొందుతుందని నమ్మకం లేదన్నారు.

- Advertisement -