కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం ఉందని ఎంపీ కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్యసమావేశంలో మాట్లాడిన కవిత అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అన్నిస్ధానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని…రానున్న ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందన్నారు.
మహాకూటమి పేరుతో రాష్ట్రంలో కుట్రలు మొదలయ్యాయని వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కవిత. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని..ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు.
అతితక్కువ కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని కొనియాడారు బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. త్వరలోనే కాళేశ్వరం పూర్తవుతుందని రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ కవిత ఎంతో కృషి చేస్తోందని…. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు.