బంగారు బోనమెత్తిన ఎంపీ కవిత

301
mp kavitha
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమై అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి వేలాది మంది భక్తులు దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

స్వయంగా ఎంపీ కవిత నెత్తిన అమ్మవారి బంగారు బోనం ఎత్తుకుని ఆదయ్య నగర్‌ నుండి, సిటీ లైట్‌ హోటల్‌, ఆర్మీ రోడ్డు, సుభాష్‌ రోడ్డు మీదుగా మహంకాళి టెంపుల్‌ వద్దకు చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఎంపీ కవితతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డిలతో పాటు శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -