ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు నిజామాబాద్ ఎంపీ కవిత. తన ఇంటి ఆవరణలో ఓ మొక్కను నాటి ట్విటర్ లో పోస్టు చేశారు. హరితహారంలో భాగంగా పచ్చదనం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేస్తూ మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దర్శకుడు రాజమౌళి, సైనా నెహ్వాల్ లకు సవాల్ విసిరారు. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
పరిసరాలు పచ్చదనంతో నిండాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 27న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ సంస్థలు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మేడ్చల్ లో మూడు మొక్కలు నాటి, నిజామాబాద్ ఎంపీ కవితకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. కవితతో పాటు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ , మేడ్చల్ కలెక్టర్ ఎం.వి. రెడ్డిలను కూడా నామినేట్ చేశారు. మీరు మొక్కలు నాటి, మరో ముగ్గురికి నామినేట్ చేయాలని సూచించారు.
Accepted priyanka’s nomination & Doing my bit for greener World !! I nominate miss @Nsaina, Deputy CM Mahmood Ali garu, RadhaKrishna garu @abntelugutv & @ssrajamouli garu to take up the green challenge!! Plant a sapling & spread the word for a greener better world!! #HarithaHaram pic.twitter.com/fTbp92JAzG
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 21, 2018