రిజర్వేషన్ల వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని జగ్గీవాసుదేవ్ అన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ది పార్క్ హోటల్ లో లీడర్‌షిప్ ఎంపవర్‌మెంట్ ఇన్ ఉమెన్ అనే అంశంపై సదస్సు జరిగింది.ఈ సదస్సులో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో పాటు ఎంపీ కవిత పాల్గొన్నారు.
శివుడిలోని అర్ధనారీశ్వర తత్వమే మహిళకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పిందని జగ్గీ వాసుదేవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో మగ, ఆడ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టొద్దని.. రిజర్వేషన్ల వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయడం సబబు కాదని చెప్పారు. అయితే గత 20 ఏళ్లలో మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన.. ఇంకా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Ms.Kalvakuntla Kavitha, MP, Nizamabad, "In Conversation with the Mystic" @SadhguruJV on "Leadership Empowerment in Women" at an event hosted by @FICCIFLO in Hyderabad today. @RaoKavitha #FICCIFLO pic.twitter.com/quaccwlnJJ
— Isha Foundation (@ishafoundation) November 27, 2017