9 దేశాల్లో బతుకమ్మ సంబురాలు

230
- Advertisement -

వర్షాలను శుభసూచికంగా భావించి బతుకమ్మ సంబురాలను జరుపుకుందామని జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత తెలిపారు.తెలంగాణ భవన్‌లో జాగృతి యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన కవిత ఈ నెల 30 నుంచి బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తామని తెలిపారు. జాగృతి సమాచారమంతా యాప్‌లో ఉంటుందని తెలిపారు.9 దేశాలతో పాటు 1100చోట్ల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తమ సంస్కృతిని ప్రపంచానికి తెలియచెప్పాలని కోరారు.

mp kavitha

చరిత్రలోనే ఈ సారి భారీ వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు. మిడ్‌మానేరుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్షాలను కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992లో మిడ్‌మానేరును నిర్మించాలని ప్రతిపాదిస్తే.. 2006లో తొలిసారిగా టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. వర్షాలు భారీగా పడ్డప్పుడు నష్టం జరుగుతుందని… ఇలాంటి సమయాల్లో పార్టీలకతీతంగా ప్రజలకు సాయం చేయాల్సింది పోయి.. రాజకీయాలు చేస్తున్నాయని ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.

kavitha

వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్రజరుగుతోందని ఆరోపించారు. నగరంలోని 25 సర్కిళ్లలో 5 సర్కిళ్ల పరిధిలో మాత్రమే నీరు వచ్చిందని తెలిపారు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి తీరుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో 25 వేల మందితో బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తామని కవిత తెలిపారు.

trs

- Advertisement -