గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ః ఎంపీ కవిత

248
kavitha-Organ-Donation-Camp
- Advertisement -

కోట్లాది మంది ప్రజలను పరాయి పాలన నుంచి విముక్తి చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. పేద ప్రజల కష్టాలు తీర్చే గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అవయవదాన సంకల్ప కార్యక్రమానికి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మద్దతివ్వడం సంతోషకరం అని ఎంపీ కవిత పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి, టీ-న్యూస్, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన అవయవదాన మహాసంకల్పం కార్యక్రమాన్ని ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించారు.

 mp Kavitha In Oragn Donation

ఈకార్యక్రమంలో అవయవదాన పత్రంపై సంతకం చేశారు ఎంపీ కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వరకు సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. దేశం మొత్తంలో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మనందరి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.

 mp Kavitha In Oragn Donation

ఈకార్యక్రమం ఇంతటితో ఆగిపోయేది కాదు..వచ్చే సంవత్సంర కేసీఆర్ పుట్టిన రోజు వరకూ 50వేల మందితో అర్గాన్ డొనేషన్ చేయించాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. ఆరోగ్యశ్రీ పథకంలో అవయవ మార్పిడిని కూడా చేర్చాం. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లకు ధన్యవాదాలు. నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి ఆపరేషన్లన్నీ విజయవంతమయ్యాయి. డాక్టర్ల కమిట్‌మెంట్‌తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని కవిత పిలుపునిచ్చారు.

- Advertisement -