ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. మార్చి 1న న్యూఢిల్లీలో ఐక్యరాజ్య సమితి,గ్లోబల్ కాంపాక్ట్ , గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా నిర్వహించే లింగ సమానత్వ సమ్మిట్లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది.
పారిశ్రామిక విప్లవంలో భాగంగా దేశంలో వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్, బిగ్ డేటా, డిజిటల్ ఇంటర్ఫేస్ పాత్ర పెరిగింది. ఈనేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా మార్చి 1న న్యూఢిల్లీలో లింగ సమానత్వ సమ్మిట్ ఏర్పాటు చేసింది.
లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్డీజీ లక్ష్యాల సాధన కోసం చేస్తున్న కృషిని గుర్తించి కవితను ఈ సమ్మిట్ లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది.
ఇటీవలె ఉత్తమ పార్లమెంటెరీయన్గా అవార్డులు అందుకున్నారు ఎంపీ కవిత. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్సభకు హాజరు, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా కవితను ఈ అవార్డుకు ఎంపికచేశారు.
ఉద్యమ సమయంలో అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో కవిత క్రియాశీలకంగా వ్యవహరించారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేశారు. మహిళ సాధికారిత కోసం విశేష కృషి చేస్తున్నారు. కవితకు మరో అరుదౌన గౌరవం దక్కడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.