నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ కవిత

304
mp kavitha nomination
- Advertisement -

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ కవిత. నామినేషన్ దాఖలు చేయడానికంటే ముందు సారంగాపూర్ లోని హనుమాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. భర్త అనిల్‌తో కలిసి పూజలు చేసిన అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తెగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు కవిత. కరీంనగర్‌లో పుట్టిన కవిత యుఎస్‌లో ఎమ్మెస్‌ చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చిన కవిత 2004 నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

mp kavitha

తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో చురుకుగా వ్యవహరించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన కవిత గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌లో గులాబీ జెండా ఎగరడంలో కీలకపాత్ర పోషించారు. సాధించారు. పార్లమెంట్‌లో అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2003లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు.

- Advertisement -