బాహుబలి వచ్చినా, బాద్‌షా వచ్చినా.. డోంట్ కేర్

157
MP KAVITHA
- Advertisement -

ఢిల్లీ నుంచి బాద్‌షా వచ్చినా, కాంగ్రెస్ నుంచి బాహుబలి వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్, గుండారం చౌరస్తాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆమె వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని  ధీమా వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని కవిత అన్నారు.

టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. తమ ప్రభుత్వం పేదల, రైతుల ప్రభుత్వమని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ, ప్రజలకు ఏ లోటు లేకుండా పాలిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసముందని… రానున్న ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని చెప్పారు.

- Advertisement -