యుఎస్‌లో అరెస్టయిన తెలంగాణ విద్యార్థులను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ జితేందర్ రెడ్డి. లోక్ సభ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన యూఎస్‌కు చెందిన హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విదేశీయులకు ఎర వేసిందని అందులో తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారన్నారు.
యూఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేలా చేసి వారిని భారత్‌కు తీసుకొచ్చి ఆదుకోవాలని కోరారు. అరెస్టయిన వారిలో తన నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపారు. అది ఫేక్ యూనివర్సిటీ అని విద్యార్థులకు తెలియదని వాళ్లు యూఎస్‌కు అక్రమంగా వెళ్లలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడరని దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కాన్సులేట్ జనరల్ ద్వారా తెలుసుకుంటున్నట్టు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు జితేందర్ రెడ్డి.