రూపాయికే భోజనం…ప్రారంభించిన గంభీర్

260
gambir
- Advertisement -

ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో జన్ రసోయి(రూపాయికే భోజనం)ని ప్రారంభించారు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. రూపాయికే పేదలకు భోజనం సమకూర్చడం ప్రశంసనీయమని ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ పాండా పేర్కొన్నారు.

ఆహారం ప్రజల కనీస అవసరమని, దేశ రాజధానిలోనూ రెండు పూటలా కడుపు నిండా ఆహారం లభించని వారికి కేవలం రూపాయికే లంచ్‌ అందిస్తున్నామని చెప్పారు గౌతమ్ గంభీర్. తాను డ్రామాలు, ధర్నాలు చేపట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని, పేదలకు ఇలా చేతనైనంత సాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు.

గత ఏడాది డిసెంబర్‌లో తొలి జన్‌ రసోయిని తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని గాంధీ నగర్‌ మార్కెట్‌లో గంభీర్‌ ప్రారంభించారు. ఈ క్యాంటిన్‌లో ఇప్పటివరకూ 50,000 మందికి భోజనం సమకూర్చగా తాజాగా ప్రారంభించిన క్యాంటిన్‌లో ఒకే సమయంలో యాభై మందికి లంచ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -