కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్స్, అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలానే చేస్తే ప్రజల చేతుల్లో దెబ్బలు తప్పవు అని హెచ్చరించారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై దృష్టి పెట్టారు ఈటల.
ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగవంతం చేయాలని కొత్త ఫ్లై ఓవర్స్ మంజూరు చేయాలని నిన్న కేంద్రమంత్రి గడ్కరిని కలసిన ఈటల ఈరోజు కొంపల్లి ఫ్లై ఓవర్ పనులు పరిశీలించారు. అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
2022 ఏప్రిల్ లో ఈ ఫ్లై ఓవర్ పనులు మొదలయ్యాయి. మూడేళ్ళు పూర్తి అయ్యాయి కానీ ఫ్లై ఓవర్ పనులు మాత్రం పూర్తి కాలేదు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వందలమందికి గాయాలు అయ్యాయి. నిర్మాణం చేస్తాం మంచి చేస్తామని వచ్చిన కాంట్రాక్టర్లు ఆలస్యం చేసి ప్రజల ఉసురు తీస్తున్నారు. వీరికి ఏం పనిష్మెంట్ ఇచ్చినా తప్పులేదు. చేతకాని వారు టెండర్ ఎందుకు వెయ్యాలి. అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ప్రజలు మా ఫోటోలతో ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. ఎంత అవమానం….అసలు మీకున్న సమస్య ఏంటి అని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు ఈటల. ఉప్పల్ 6 ఏళ్లు ఇది 3 ఏళ్లు ప్రాణాలు పోతున్నాయి…రెండేళ్లు అంటే 2024 ఏప్రిలో లో పూర్తి కావాలి కానీ ఇంకా కాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల.
సంవత్సర గా వాళ్ళ కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలేదు.మీ మాటలు వినడానికి రాలేదు, కాంట్రాక్టర్ స్పందించక పోతే దెబ్బలు తప్పవు…ఇలాంటి వాళ్ళను జైల్లో పెట్టించాలి..మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా ? , పక్కన ఉన్న రోడ్లు గుంటలన్నా పూడ్చి వాహనాలు వేగంగా వెళ్లేలా చూడాలి కదా.. మీ అధికారులు ఎందుకు చేయడం లేదు,షాపులలో రెండు ఇంచుల దుమ్ము పడుతుంది. ..ఇంకా సహనం లేదు..నిర్లక్ష్యం వహిస్తే ప్రజల చేతుల్లో దెబ్బలు తప్పవు అని హెచ్చరించారు.
ఈ రోడ్ లో గతంలో ఆటోలు, ట్రాలీలు పార్కింగ్ పెట్టుకునేవాళ్లకు.. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోతున్నామని, ఫ్లైఓవర్ కింద పార్కింగ్ కల్పించాలని డ్రైవర్లు ఎంపీ రాజేందర్ ను కలిశారు. అధికారులతో చర్చించి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని వారికి తెలిపారు
Also Read:27న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

