రైతుల ఉద్యమాన్ని అవమానించిన ఎంపీ అర్వింద్..!

321
Dharmapuri Aravind
- Advertisement -

దేశంలో బీజేపీ నేతలు బరితెగిస్తున్నారు. మోదీ భక్తులు రెచ్చిపోతున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ఎవరైనా వ్యతిరేకిస్తే చాలు వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం బీజేపీ భక్తులకు పరిపాటిగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయరంగాన్ని మెల్లగా కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి నెట్టేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రైతన్నల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ నల్లచట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నడిరోడ్లపై వేలాదిగా రైతన్నలు ఆందోళనలు చేస్తున్నా మోదీ సర్కార్ కనికరించడం లేదు. కొత్త వ్యవసాయచట్టాలను రద్దు చేసేందుకు మోదీ సర్కార్ ససేమిరా అంటోంది..మరోవైపు రైతులు కూడా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు.

దేశ రాజధానిలో రైతన్నలు చేస్తున్న పోరాటంతో అంతర్జాతీయ సమాజం ముందు మోదీ సర్కార్ పరువు పోయినట్లైంది. ఇక రిపబ్లిక్ డే నాడు రైతన్నలు చేపట్టిన ట్రాక్టర్ కవాతు ర్యాలీ అదుపు తప్పి హింసాత్మక ఘటనలు చెలరేగడంతోపాటు, ఎర్రకోటపై జాతీయ జెండా పక్కన సిక్కుల పవిత్రమతపరమైన జెండా ఎగరడం దేశ ప్రతిష్టకు భంగం కలిగించింది. రైతుల ఉద్యమాన్ని దెబ్బ కొట్టేందుకు బీజేపీ సానుభూతిపరుడైన దీప్ సిద్ధూ రైతుల ముసుగులో ఉద్యమంలో చొరపడి ఎర్రకోటపై జెండా ఎగరవేసాడని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులు బాత్రూంలకు పోకుండా నీళ్లు లేకుండా చేస్తూ. ఇంటర్నెట్ కట్ చేస్తూ కేంద్రం అమానుషంగా వ్యవహరిస్తుంటే…. బీజేపీ నేతలు రైతులు ఖలిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారిని కాల్చివేయాలంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కోవలో మన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా చేరారు.

నన్న గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తా అంటూ రైతులను బాండు పేపరుతో మభ్యపెట్టి ఎంపీగా గెలిచాడు అర్వింద్. ఆ తర్వాత మాట మార్చి, రైతులను కించపర్చడంలో అధర్మపురి అర్వింద్ సారీ ధర్మపురి అర్వింద్ ఓ రెండాకులు ఎక్కువే చదివారు. తాజాగా దేశ రాజధానిలో నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న రైతులపై అర్వింద్ నోరుపారేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని కమ్మరపల్లి భీంగల్‌ మండలలో పర్యటించిన అర్వింద్ ముందుగా ఎండిపోయిన వరి పంటను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహులు, దళారులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసే చట్టాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సమర్థించుకున్నారు. కాగా ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండు పేపరు రాసిచ్చి మరీ మోసం చేసింది కాగా..రైతులను దేశ ద్రోహులు, దళారులు అంటూ అవమానించిన ఎంపీ అర్వింద్‌పై నిజామాబాద్ పసుపు రైతన్నలు మండిపడుతున్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలకు అర్వింద్‌ మూల్యం చెల్లించకపతప్పదని , వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని రైతన్నలు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -