- Advertisement -
న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఎంపీ బీబీ పాటిల్. సుప్రీం కోర్ట్ సవరణ బిల్లు-2019 పై లోక్ సభలో మాట్లాడిన బీబీ పాటిల్ ప్రతి పదివేల మందికి కేవలం 19 మంది న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు.
సుమారు 6వేల న్యాయమూర్తుల అవసరం ఉంది. అందులో 5వేల మంది కింది స్థాయి కోర్టులోనే కొరత ఉంది.-న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎంపికైన న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్‌ల బస ఏర్పాట్లకు నిధుల కొరత ఉందని చెప్పారు.
వివిధ కోర్టుల్లో సుమారు 3కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. – ప్రస్తుతం పని చేస్తున్న న్యాయవాదులపై తీవ్ర ఒత్తిడి ఉంది.హైకోర్టుల్లో రోజుకు 20-150 కేసులను వింటున్నారు. సగటున 70కేసులను చూస్తున్నారు. లా కమిషన్ ప్రతి పదిలక్షలమందికి కనీసం 50మంది జడ్జీలు ఉండాలని సిఫారసు చేసిందని గుర్తు చేశారు.
- Advertisement -