గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎంపీ బిబి పాటిల్..

321
- Advertisement -

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ టీఆర్‌ఎస్‌ విప్‌,కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంటరీ కమిటి సభ్యులు, బిబి.పాటిల్ తన జన్మదినం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వారి నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన సోమవారం వారి నివాసంలో కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -