సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేశారుః ఎంపీ బండ ప్రకాశ్

446
Banda Prakesh
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేశారన్నారు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్. ఢిల్లీలో నిర్వహించిన కోలి సమాజ్ అభినందన్ సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్ ను సన్మానించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ది పథంలో దూసుకెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. బీసీలకు పెద్దపీట వేస్తూ నన్ను పెద్దల సభకు పంపించారన్నారు. నాకు ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని తెలిపారు.

- Advertisement -