అరెస్ట్ పై స్పందించిన ఎంపీ అవినాష్..

33
- Advertisement -

వైఎస్ వివేకా హత్య కేసులో తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై స్పందించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తన తండ్రి భాస్కర్‌ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్‌ చేశారు. దీనిపై స్పందించేందుకు మాటలు రావట్లేదు. మేం చెప్పిన అంశాలను సీబీఐ లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు.

కీలకమైన అంశాల్ని సీబీఐ పక్కనబెడుతోంది. వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడున్నాడు. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్‌ కూడా దొరికాయన్నారు.

షేక్‌ అహ్మద్‌ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందు చెప్పిందే నేను. హత్య విషయం నాకన్నా గంటముందే వివేకా అల్లుడికి తెలుసు. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. ధైర్యం కోల్పోం.. నిజాయితీ నిరూపించుకుంటాం. కట్టుకథలతో జరిగే దర్యాప్తు నిలబడదని తేల్చి చెప్పారు అవినాష్ రెడ్డి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -