కేసీఆర్‌ పాలనపై ఓవైసీ ప్రశంసల జల్లు

354
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు గుప్పించారు. కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని…ఆయన సమర్థమైన నాయకత్వం వల్లే రాష్ర్టానికి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ర్టానికి మొదటి ర్యాంకు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లలోనే సీఎం తనదైన ముద్ర వేయగలిగారని ప్రశంసించారు. రాష్ర్టానికి పెట్టుబడులు సాధించడంలో ఎంతో ముందున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలన్నారు.

గతంలో సైతం మహారాష్ట్రతో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందంపై ఓవైసీ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రతో కుదుర్చుకున్న అంతర్‌ రాష్ట్ర జల ఒప్పందం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని అభిప్రా యపడ్డారు. మహారాష్ట్రతో కుదుర్చుకున్న నీటి ఒప్పందం మూలంగా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. న్నారు.

asad-kcr

దీంతో పాటు ప్రతిపక్షాల వైఖరిని ఓవైసీ తూర్పార బట్టారు.ఇంతటి ప్రతిష్టాత్మక ఒప్పందంపై బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు.అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో ఇలాంటి నిర్ణయాలపై దృష్టిపెట్టని నాయకులు ప్రస్తుతం ఉచిత ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. ఇలా గుడ్డిగా విమర్శిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ కష్టమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు దేశంలో మొదటి స్ధానం రావటంతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -