తెలంగాణ టిడిపి సినియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే వార్త రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. తెలంగాణలో టిడిపిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు వెళ్లిన విషయం తెలిసిందే. దింతో సరైన నాయకుడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. రాష్ట్రంలో పార్టీకి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే నాయకులు పార్టీని విడాల్సి వస్తుందంటున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ టిడిపిలో ఉన్నది ద్వితియ శ్రేణి నాయకులు మాత్రమే ఉన్నారు.
యోత్కుపల్లి నర్సింహులు గతంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టిడిపిని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతని కామెంట్లపై స్పందించిన తెలుగు తమ్ముళ్లు మోత్కుపల్లిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి పార్టీలో ఏకార్యక్రమం జరిగినా మోత్కుపల్లి మాత్రం హాజరుకావడం లేదు. పార్టీ జాతియ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై కూడా మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పలు సందర్భాల్లో చంద్రబాబు మోత్కుపల్లి గవర్నర్ పదవి ఇస్తామని హామిలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇటు పార్టీలో సరైన గౌరవం లేక…అటు గవర్నర్ పదవి లేకపోవడంతో టిడిపిని విడిచిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. ఇక మోత్కుపల్లి పార్టీ మారితే ఆయనకు ఉన్న ఒకే ఒక మార్గం టీఆర్ఎస్ పార్టీలో చేరడం. తన నియోజకవర్గ ప్రజలనుంచి కూడా ఓత్తిడి పెరగడంతో త్వరలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకొనున్నారని మోత్కుపల్లి సన్నిహితులు చెబుతున్నారు.